Revanth Reddy : సీఎల్పీ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు;

కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలకు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేవం చేవఆరు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి గుర్తుంచుకోవాలన్నారు.
పదిహేను నెలల్లో...
పది హేను నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందని, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే నన్న రేవంత్ రెడ్డి సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎం ఎల్ ఏ లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, జిల్లాల వారీగా ఎం ఎల్ ఏ తో త్వరలో తాను సమావేశం అవుతానని రేవంత్ రెడ్డి తెలిపారు. పని విభజన చేసుకుని సభలో వ్యవహరించాలని అన్నారు.