Revanth Reddy : అదానీ గ్రూపు విరాళం తమకు అవసరం లేదు

అదానీ గ్రూపు విరాళాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-11-25 11:45 GMT

అదానీ గ్రూపు విరాళాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు అదానీ సంస్థకు లేఖ రాశామని తెలిపారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిందన్నారు. అయితే అదానీ గ్రూపుపై వస్తున్న అవినీతి విమర్శల దృష్ట్యా వాటిని తీసుకోవడం లేదని, ఈ మేరకు తాము లేఖ రాశామని చెప్పారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విరాళం తీసుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అదానీ విరాళాన్ని అంగీకరించామన్నరేవంత్ రెడ్డి ఆ గ్రూపుపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవడానికి నిరాకరిస్తూ లేఖరాశామని చెప్పారు.

నిధులు అవసరం లేదని...
అయితే తాము అదానీ నుంచి నిధులను సేకరించలేదన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరైనా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పన్నెండు పనులను అదానీ గ్రూపునకు అప్పగించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ ఒప్పందాలన్నీ ఇప్పుడు రద్దు చేయాలా? అంటూ రేవంత్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్న రేవంత్ రెడ్డి ఆ యూనివర్సిటీ ఎటువంటి వివాదాలకు లోను కాకూడదనే తాము అదానీ విరాళాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. తాను ఢిల్లీకి వెళ్లేది ఓం బిర్లా ఇంట్లో జరిగే వివాహకార్యక్రమానికి అని, రేపు తెలంగాణ ఎంపీలతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో పార్లమెంటులో పోరాడాలని కోరనున్నామని చెప్పారు. వీలుంటే కేంద్ర మంత్రులను కలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News