సీఎం కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకున్నట్లేనా?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి సమయంలో
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా అనే ఆలోచనతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ భారీగా రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. దీంతో పలువురు నాయకులు కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మూడోసారి టిక్కెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని, పార్టీ బలానికి నిదర్శనమన్నారు. సూర్యాపేట జిల్లా కేసీఆర్ గులాబీ కోట, జిల్లాలో కాంగ్రెస్ మంచుకొండ కరిగిపోతుందని అన్నారు. టికెట్ రాని వారు నిరాశపడొద్దని, రాజకీయాల్లో ఆశించడం తప్పుకాదన్నారు. టికెట్ రాని వారు పార్టీ గెలుపు కోసం సహకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందూరు ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కల్వకుంట్ల కవితను సోమవారం ప్రగతిభవన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కలిశారు. ఆయన పై నమ్మకంతో త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి, వరుసగా మూడోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మొత్తం 119 స్థానాలకు గానూ 115 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ 4 స్థానాలను పెండింగ్ పెట్టింది. గతంలో మాదిరి ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికే అధిక సీట్లు దక్కాయి.
ఎమ్మెల్యేల లిస్టులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారి జాబితా:
పి కౌశిక్ రెడ్డి - హుజూరాబాద్
పి సుదర్శన్ రెడ్డి – నర్సాపేట
సి ధర్మా రెడ్డి – పర్కల్
జి వెంకటరమణా రెడ్డి – భూపాలపల్లి
కె ఉపేందర్ రెడ్డి - పలైర్
ఎం పద్మా దేవేందర్ రెడ్డి – మెదక్
మహారెడ్డి భూపాల్ రెడ్డి – నారాయణఖేడ్
జి మహిపాల్ రెడ్డి – పటాన్చెరు
కె ప్రభాకర్ రెడ్డి – దుబ్బాక
సి మల్లా రెడ్డి - మేడ్చల్
బి లక్ష్మా రెడ్డి - ఉప్పల్
ఎం కిషన్ రెడ్డి – ఇబ్రహీంపట్నం
డి సుధీర్ రెడ్డి - ఎల్ బి నగర్
పి సబితా ఇంద్రకరణ్ రెడ్డి - మహేశ్వరం
కె మహేష్ రెడ్డి - పారిస్
పైలట్ రోహిత్ రెడ్డి – తాండూరు
టి అజిత్ రెడ్డి – మలక్ పేట
ఎం సీతారాం రెడ్డి – చాంద్రాయణగుట్ట
ఎస్ సుందర్ రెడ్డి – యాకుత్పురా
పి నరేందర్ రెడ్డి – కొడంగల్
ఎస్ రాజేందర్ రెడ్డి - నారాయణపేట
సి లక్ష్మా రెడ్డి - జడ్చర్ల
ఎ వెంకటేశ్వర్ రెడ్డి – దేవరకద్ర
సి రామ్ మోహన్ రెడ్డి – మక్తల్
ఎస్ నిరంజన్ రెడ్డి - వనపర్తి
బి కృష్ణ మోహన్ రెడ్డి – గద్వాల్
మర్రి జనార్ధన్ రెడ్డి - నాగర్ కర్నూల్
బి హర్షవర్ధన్ రెడ్డి – కొల్లాపూర్
ఎస్ సైది రెడ్డి - హుజూర్‌నగర్
జి జగదీష్ రెడ్డి - సూర్యాపేట
కె భూపాల్ రెడ్డి - నల్గొండ
కుసుంతల ప్రభాకర్ రెడ్డి – మునుగోడు
పైలా శేఖర్ రెడ్డి – భోంగీర్
ఎ ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్
జి విట్టల్ రెడ్డి - ముధోల్
ఎ జీవన్ రెడ్డి – ఆర్మూర్
పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
వేముల ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ
దాసరి మనోహర్ రెడ్డి – పెద్ద పల్లి