పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పది కోట్ల నష్టం

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వరద ఎఫెక్ట్ పడింది. పది కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది

Update: 2024-09-03 04:20 GMT

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వరద ఎఫెక్ట్ పడింది. పది కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల వద్ద నీరు నిండుగా ఉంది. వాగులు, వంకలు పొంగిపొరులుతున్నాయి. అయితే పాలమూరు - రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.

వరద నీరు ప్రవేశించడంతో....
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగమైన వెంకటాద్రి పంప్ హౌస్ వరద నీటిలో మునిగింది. ముప్ఫయి నాలుగు కీలోమీటర్ల పరిధిలో టన్నెల్ లో వరద నీరు చేరింది. అయితే ఈ వరద నీరుచేరడతో పంప్ హౌస్ లోపల ఉన్న మెషనరీ దెబ్బతినిందని అధికారులు చెబుతున్నారు. కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ధృవీకరించారు.


Tags:    

Similar News