అది చిరుత కాదట.. అడివిపిల్లి అట

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన జంతువు చిరుత కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు

Update: 2024-06-26 03:16 GMT

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన జంతువు చిరుత కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. ట్రాప్ కెమెరాలలో అది చిరుత కాదని అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు తేల్చారు. శంషాబాద్ మండలంలోని ఘాన్సీ మియాగూడలో చిరుత పులి సంచరిస్తుందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భయభ్రాంతులకు లోనయ్యారు.

ట్రాప్ కెమెరాలో...
దీంతో జంతువు కదలికలున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను, బోన్లను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ట్రాప్ కెమెరాలో అది చిరుత కాదని తేలింది. ట్రాప్ కెమెరాలో అడవిపిల్లి కదలికలు కనిపించాయి. ఇదే విషయాన్ని గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News