గ్యాస్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నామంటారు.. జర భద్రం!!
హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో సేవలు అందిస్తున్న గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్
హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో సేవలు అందిస్తున్న గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. బీజీఎల్ పేరు,లోగోను దుర్వినియోగం చేస్తూ కొత్త స్కామ్ కు పాల్పడుతున్నారని.. వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది.
కొందరు మోసగాళ్లు వాట్సప్, వాయిస్ కాల్స్ ద్వారా కస్టమర్లను మోసగిస్తున్నారని.. డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఓ APK ఫైల్‌ను షేర్ చేస్తున్నారని BGL పేర్కొంది. ఆ యాప్ ను ఇన్స్టాల్ చేస్తే మోసపోతారని హెచ్చరించారు. మోసపూరిత కార్యకలాపాలలో ఫోన్ నంబర్లు 9940364176 (WhatsApp), 9390958942 (మొబైల్) ఉన్నాయి. ఏదైనా అనధికార APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోవాలని, ఈ నంబర్‌ల నుండి వచ్చే సందేశాలు లేదా కాల్‌లకు ప్రతిస్పందించకుండా ఉండాలని BGL తన కస్టమర్‌లకు సూచించింది. తెలియని వ్యక్తులతో ఎలాంటి వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు), పాస్‌వర్డ్‌లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని కస్టమర్‌లకు సూచించారు. BGL తన అధికారిక వెబ్‌సైట్ www.bglgas.comలో ఉన్న కాంటాక్ట్‌లకు తప్ప మరే ఇతర కాంటాక్ట్‌లకు ప్రతిస్పందించవద్దని తన వినియోగదారులను కోరింది.