Telangana : నేడు తెలంగాణలో కొత్త పాలసీ విడుదల
ఈరోజు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనుంది.
ఈరోజు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనుంది. నూతన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. చిన్న తరహా మధ్య పరిశ్రమలను రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేయూత నిచ్చే విధంగా నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలిసింది.
నిరుద్యోగ సమస్యను...
రాష్ట్రంలో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల నిరుద్యోగానికి చాలా వరకూ నిర్మూలించవచ్చన్న అభిప్రాయంలో ఉంది. అందుకే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన పాలసీని రూపొందించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.