ఎవరి గోల వారిదే..!!

తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తోంది...!!! గజిబిజి పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పవచ్చు..!!

Update: 2024-09-15 08:46 GMT


తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తోంది...!!! గజిబిజి పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పవచ్చు..!!

ప్రముఖ దర్శకుడు, ఈవీవీ సత్యనారాయణ తీసిన ఎవడిగోల వాడిదే సినిమాని తలపించే విధంగా తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి..

ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే...!!??

పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లను ఎలా కాపాడుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ తలతోక పెట్టుకుంటుంది..!!

కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార సమయంలో..సమయంలో .. నెరవేర్చడానికి కూడా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సరిపోని విధంగా హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామని హమీ ఇచ్చింది..!!

వాటిలో భాగంగా..

చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని,..

అర్హులైన మహిళలకు తులం బంగారం ఇస్తామని..

రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రెండు లక్శలలోపు రుణమాఫీ చేస్తానని..

200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తామని..

అర్హులైన మహిళలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల అందిస్తామని...

మహిళలందరికీ ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని...

రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని...ఇలా చెప్పుకుంటూ పోతే...చాలా ఉన్నాయి..

పైన పేర్కొన్న హామీల్లో అన్నీ అమలవుతున్నాయా అంటే... లేదనే చెప్పాలి..

దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి..!!

అధికారంలోకి వచ్చిన వెంటనే... మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం పథకం ప్రవేశ పెట్టారు... ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఈ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని చెప్పవచ్చు..!!

200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు..!!

ఇది పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు... రాష్ట్రంలో కొంత మంది ప్రజలకు మాత్రమే ఈ పథకం అమలు జరుగుతోంది.. అర్హులైన ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకున్న కానీ.. రకరకాల కారణాలతో వారికి ఉచిత విద్యుత్ పథకం అమలు అవటం లేదు.. ఈ పథకం అమలు చేసిన నాటి నుండి 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్నవారు.. కరెంట్ బిల్లు అసలు కట్టాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి అన్నారు..కానీ.. పథకం మొదలు పెట్టిన ఆరు నెలల తరువాత..ఈ పథకం అమలుకు నోచుకున్న కుటుంబాలు... పథకం మొదలు పెట్టిన నాటి నుండి వచ్చిన కరెంట్ బిల్లు కొట్టాలని లేకుంటే... కరెంట్ కట్ చేస్తామని చెప్తున్నారు..

ఈ రకంగా ఉచిత విద్యుత్ పథకం... అరకొరగా అమలు అవుతోంది..!!

మరో పథకం రైతు బంధు..ఇది అసలు ఇంత వరకు మొదలు పెట్టలేదు..

రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు..అందరికీ చేశామని చెప్పారు ... ఇప్పటి వరకు సగం మందికి పడలేదని చెప్తున్నారు..!!

ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ఉన్నాయి...

రీసెంట్ గా హైడ్రా మొదలు పెట్టారు.. చెరువులు, నాళాలపై ఉన్న అక్రమ కట్టడాలు కూల్చడం దీని ముఖ్య ఉద్దేశం..!!

దీనిపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఏర్పడింది...కానీ ప్రతిపక్ష పార్టీ హైడ్రా ఒక పెద్ద హైడ్రామా అని ఇచ్చిన హామీలను అమలు చేయలేక... హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు..!!

ఉన్న ఎమ్మెల్యే లను ఎలా కాపాడుకోవాలి అని... బీఆర్ఎస్ పార్టీ తికమక పడుతుంది...!!

రెండు పర్యాయాలు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ, మూడోసారి ప్రజల ఆగ్రహానికి గురైంది..38 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..!!

అయితే.. అమలు కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని..

వాటి అమలు గురించి ప్రశ్నించి పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ.. వీటిని ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్లి, ప్రజల మన్ననలను పొందే అవకాశం ఉన్నా...కానీ ఆ పని చేయలేక పోతోంది...

ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుండే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయింపుల పర్వం మొదలైంది..

బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న 38 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వలసలు మొదలుపెట్టారు...!!

ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సంఖ్యాబలం 28 . వీరిని పార్టీలో నుంచి వెళ్ళకుండా కాపాడటం పార్టీ కి కత్తిమీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు...

Tags:    

Similar News