ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకూ రంజాన్ మాసం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు

Update: 2022-04-02 13:11 GMT

హైదరాబాద్ : ముస్లిం సోదరులు పవిత్రమాసంగా పరిగణించే రంజాన్ మాసం శనివారం నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకూ రంజాన్ మాసం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో విధులకు హాజరయ్యే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం వేళ 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంజాన్ మాసంలో ముస్లింసోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా ఉపవాస దీక్షలు చేస్తారు. అలా ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రార్థనలు కొనసాగించేందుకు సాయంత్రం వేళ గంట ముందే ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వెసులుబాటు రాష్ట్రంలో ప్ర‌భుత్వ శాఖలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే ముస్లిం ఉద్యోగులంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.


Tags:    

Similar News