కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపండి

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది;

Update: 2024-04-08 12:31 GMT
brs,  suffered,  setback, high court
  • whatsapp icon

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ వేశామని న్యాయస్థానానికి ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటీషనర్లు హైకోర్టు ను కోరారు.

జ్యుడిషియల్ విచారణ చేయాలని...
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవతకవలు జరగడమే కాకుండా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని పిటీషన్ ఆరోపించారు. అయితే దీనిపై ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినందున ఇక సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వివరించారు. తదుపరి విచారణ ను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది


Tags:    

Similar News