Telangana : మరో రెండు రోజులు వర్షాలే... ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది;

Update: 2024-06-28 02:46 GMT
Telangana : మరో రెండు రోజులు వర్షాలే... ఎల్లో అలెర్ట్ జారీ
  • whatsapp icon

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరుగాను, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

అత్యధిక వర్షపాతం...
హైదరాబాద్ తో పాటు అనేక జిల్లాల్లో నిన్న భారీ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో అత్యధికంగా 10.49 సెంటీమీటర్లు, కరీంనగర్ మండలంలో 9.89 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


Tags:    

Similar News