ఎల్లో అలర్ట్ : తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన..
నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం..
నేటి నుంచి రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 13 వరకూ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 19 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు 12,13 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవవచ్చని తెలిపింది.
నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
13,14వ తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. 15వ తేదీ కూడా రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్ప వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.