Breaking : ఫార్ములా ఈ రేస్ కేసుపై లేటెస్ట్ అప్ డేట్
తెలంగాణలో ఫార్ములా కారు ఈ రేస్ లో జరిగిన అవకతవకలపై తాజా అప్ డేట్ లభించింది
తెలంగాణలో ఫార్ములా కారు ఈ రేస్ లో జరిగిన అవకతవకలపై తాజా అప్ డేట్ లభించింది. నిన్న రాత్రి ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీకి గవర్నర్ ఇచ్చిన అనుమతి వెళ్లింది. దీంతో చీఫ్ సెక్రటరీ ఈరోజు, రేపట్లో అవినీతి నిరోధకశాఖకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ విచారణకు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతివ్వడంతో ఏసీబీకి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
నిధులను విడుద చేసి....
ఫార్ములా కారు ఈ రేస్ లో దాదాపు యాభై రెండు కోట్ల రూపాయలను విడతలుగా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ కంపెనీకి విడుదల చేయడంపై విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను కూడా విచారించనున్నారని తెలిసింది. హెచ్ఎండీఏ నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా విడుదల చేయడాన్ని తప్పుపడుతూ విచారణ జరగనున్నట్లు తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now