Telagana : పాదయాత్రగా రేవంత్ రెడ్డి రాజభవన్ కు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు

Update: 2024-12-18 07:54 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం జరిగింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మోదీ ప్రభుత్వం గౌతమ్ అదానీ అవినీతిపై విచారణలు జరపాలని, మణిపూర్ ఘటనపై మోదీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు.

అక్కడే బైఠాయించి...

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ తో పాటు పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రాజ్ భవన్ ఎదుట బైఠాయించి నేతలు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. అయితే రాజ్ భవన్ నుంచి అనుమతి రాకపోవడంతో అక్కడే ముఖ్యమంత్రి, మంత్రులు వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News