Telangana : నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్య్రమం చేపట్టనున్నారు.
నిరసన ర్యాలీ...
దేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now