బీఆర్ఎస్ విన్నూత్న ఆందోళన.. ఆటోల్లో వచ్చి నిరసన
తెలంగాణ అసెంబ్లీకి నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విన్నూత్నంగా వచ్చారు. ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు
తెలంగాణ అసెంబ్లీకి నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విన్నూత్నంగా వచ్చారు. ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆటో కార్మికుల అన్న ఆత్మహత్యలను నివారించాలని కోరుతూ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పరిస్థితి ఆందోళన కరంగా తయారైందని అన్నారు.
ఆటోల్లో వచ్చి...
వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఒక ఆటోను డ్రైవ్ చేస్తూ అసెంబ్లీకి తరలించారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా వారు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now