KTR : కాంగ్రెస్ ర్యాలీపై కేటీఆర్ సెటైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ర్యాలీపై సెటైర్ వేశారు

Update: 2024-12-18 06:15 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ర్యాలీపై సెటైర్ వేశారు. ఈరోజు చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లుందని ఎద్దేవా చేశారు. అదానీకి తోడునీడుగా ఉంటూ ఆయన కష్టపడుతున్న రేవంత్ రెడ్డి నేడు అదే అదానీ వ్యతిరేకంగా ప్రదర్శన చేయాలని అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.



ఢిల్లీలో రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని...

జైపూర్‌లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదని, రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకలేదని, కొత్త నాటకానికి చిట్టి నాయుడు శ్రీకారం చుట్టాడన్నారు. వందలు, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి అదానీ వ్యతిరేక రాలీ తీస్తున్నారని అన్నారు. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్ రెడ్డిని చూసే రాసుంటారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News