Hydra : హైడ్రా కమిషనర్ తాజా కామెంట్స్ ఇవే.. కూల్చేవి ఇవేనట
హైడ్రా సంస్థ ఏర్పాటు కాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ కూల్చబోమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు
హైడ్రా సంస్థ ఏర్పాటు కాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ కూల్చబోమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్.టి.ఎల్ లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి.. తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయని రంగనాధ్ తెలపారు.
అక్రమకట్టడాలను...
అవి నివాసాలు అయినా సరే.. జులై తరువాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామని తెలిపారు. కత్వా చెరువు , మల్లంపేట లో , అమీన్ పూర్ లో కూల్చివేత లు ఈ కేటగిరీ లోకి వస్తాయని చెప్పారు. పేదలను ముందు పెట్టి.. వెనుకనుండి చక్రం తిప్పుతున్న భూకబ్జాదారుల చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూలుస్తామని తెలిపారు. - హైడ్రా ఆవిర్భావం తర్వాత అంటే జూలై 19 th 2024కు తర్వాత అనుమతి ఇచ్చి ఉన్నా, లేకున్నాఎఫ్.టి.ఎల్ పరిధి లో వుంటే కూల్చివేస్తామని రంగనాధ్ తెలిపారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేస్తామని చెప్పారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now