Breaking : కేటీఆర్ కు ఎదురుదెబ్బ
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది;
మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాస్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఈ తీర్పు కోసం రాజకీయ పార్టీలన్నీ ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై వాదనలు ఇటీవల ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది. నేడు హైకోర్టు తీర్పు చెప్పింది.
వరస విచారణలతో...
హైకోర్టు తీర్పు కోసం కేటీఆర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈనెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈడీ అధికారుల ఎదుటకు ఈరోజు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పు ఉండటంతో తాను మరొక రోజు విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ తీర్పు కీలకంగా మారింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలూ ఈ కేసులో తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now