శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు

నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల అనుమతిని ఇంటర్‌బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.

Update: 2023-03-07 02:51 GMT

నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల అనుమతిని ఇంటర్‌బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవల ఇంటర్మీడియట్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి శ్రీ చైతన్య కళాశాలలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇది రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

విద్యార్థి మృతితో...
దీంతో రంగంలోకి దిగిన ఇంటర్ బోర్డు కళాశాల అనుమతిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. శాశ్వతంగా అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లెక్చరర్ల వేధింపులు, చదువుపై వత్తిడుల కారణంగానే సాత్విక్ మరణించారని పోలీసుల ప్రాధమిక నివేదికలో వెల్లడయిన నేపథ్యంలో ఇంటర్‌బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News