Rain Alert : ఇరవై జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది;

Update: 2024-09-30 04:07 GMT
rains, three days, telangana meteorological department,  moderate rains for three days in telangana, rains in telangana, telangana weather news today,

heavy rains in telangana 

  • whatsapp icon

తెలంగాణలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి చిరుజల్లలు అనేక జిల్లాల్లో పడే అవకాశముందని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ జిల్లాల్లో....
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొమురం భీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తిర, నారాయణపేట్, జోగులాంబ జిల్లాల్లో మోస్తు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మొత్తం ఇరవై జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.


Tags:    

Similar News