KTR : ముగిసిన కేటీఆర్ విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ ముగిసింది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ ఫార్ములా కారు రేసు కేసులో ఉదయం నుంచి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఉదయం పది గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ ను పదిన్నర గంటల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మధ్యలో అరగంట లంచ్ బ్రేక్ తర్వాత తిరగి విచారణను ప్రారంభించారు.
ఏడు గంటల పాటు...
ఉదయం పదిన్నర గంటకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదున్నర గంటల వరకూ విచారణ సాగింది. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ చేశారు.అన్ని అంశాలలో కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. విదేశీ సంస్థకు నిధులను మళ్లించడంపైనే ఎక్కువగా కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. సాయంత్రం ఆరు గంటలకల్లా విచారణ ముగించాలన్న ఈడీ నిబంధనల మేరకు ఆయన విచారణ ఈరోజుకు ముగిసింది. మరికాసేపట్లో ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు రానున్నారు.