ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది.;

Update: 2024-10-26 03:45 GMT
key development, phone tapping case,  red corner notice,  telangana
  • whatsapp icon

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి శాఖకు ఈ విషయం తెలియజేశారు. కేంద్ర హోం శాఖ విదేశాంగ శాఖకు ఈ సమాచారాన్ని పంపుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా భావిస్తున్నారు.

పాస్‌పోర్టు రద్దు...
ఆయన అనారోగ్యం పేరుతో పరీక్షలు చేయించుకోవడానికి అమెరికా వెళ్లారు. ఆయన అక్కడి నుంచి రాకపోవడంతో చివరకు పోలీసులు పాస్‌పోర్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మరో న్యూస్ ఛానల్ ఎండీ పాస్‌పోర్టును కూడా రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది కీలక పరిణామంగా చెప్పొచ్చు.


Tags:    

Similar News