అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి

ఆయనకు ఇద్దరు కొడుకులు ఉండగా.. పెద్దకొడుకు హేమంత్ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్ లో ఎంబీబీఎస్..;

Update: 2023-04-19 07:15 GMT
barbados, khammam student dies of heart attack, caribbean beach

khammam student dies of heart attack

  • whatsapp icon

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు తీరని విషాదాలను మిగుల్చుతున్నాయి. చిన్నా-పెద్దా, ముసలి - ముతక తేడా లేకుండా సంభవిస్తోన్న గుండెపోటు మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అప్పటివరకూ ఎంతో సరదాగా, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కన్నుమూస్తున్నారు. తాజాగా.. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 18న కరేబియన్ దీవుల్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు.

వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ మండలం సాయిప్రభాత్‌నగర్‌లో నివాసముంటున్న టి రవికుమార్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉండగా.. పెద్దకొడుకు హేమంత్ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్ లో ఎంబీబీఎస్ చదివేందుకు 2021లో వెళ్లాడు. ప్రస్తుతం హేమంత్ అక్కడ ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం.. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన హేమంత్‌ .. ఈతకు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికి గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. హేమంత్ అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ గా తిరిగి వస్తాడనుకున్న కొడుకు.. విగతజీవిగా మారాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Tags:    

Similar News