Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆవర్తనం విస్తరించి ఉండటంతో దాని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఆవర్తనం విస్తరించి ఉందని తెలియజేసింది. వాతావరణ శాఖ పదహారు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఈ జిల్లాల్లో...
వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జిగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీ, ఆదిలాబాద్, జనగాం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో ఉరుము మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ...
ఆంధ్రప్రదేశ్ లోనూ నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశ, ఉత్తరాంధ్ర తీరప్రాంతాలకు చేరే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.