Summer : నేటి నుంచి మండిపోనున్న ఎండలు.. సాధారణం కంటే?

నిన్నటి వరకూ కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినా నేటి నుంచి మాత్రం గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరనున్నాయి.

Update: 2024-03-24 02:48 GMT

నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నిన్నటి వరకూ కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినా నేటి నుంచి మాత్రం గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

అసాధారణ రీతిలో...
మార్చి నెలలో ద్రోణి కారణంగా అక్కడకక్కడా చిరుజల్లులు కురిసినప్పటికీ ఇకపై ఎండలు మండిపోనున్నాయి. శనివారమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోయింది. ఆదివారం నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News