ఎవడు పడితే వాడడిగితే ఇస్తామా?

ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘాటు రిప్లై ఇచ్చారు.;

Update: 2023-05-04 12:07 GMT
ఎవడు పడితే వాడడిగితే ఇస్తామా?
  • whatsapp icon

ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘాటు రిప్లై ఇచ్చారు. తమకు పరిశ్రమ నుంచి నంది అవార్డులు ఇవ్వాలంటూ ఎవరూ ప్రతిపాదనలు ఇవ్వలేదని తలసాని తెలిపారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరుపున నంది అవార్డులు ఇస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.

వచ్చే ఏడాది...
అంతే తప్ప ఎవరో ఏదో అడిగారని తాము ఇవ్వడం కుదరని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల నిర్మాత ఘట్టమనేని శేషగిరిరావు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం లేదని చేసిన వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. అశ్వినీదత్, తమ్మారెడ్డి భరధ్వాజ్‌లు కూడా నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా కలకలం రేపాయి. దీనిపై మంత్రి తలసాని తొలిసారి స్పందించారు.


Tags:    

Similar News