పురాణాపూల్ వరద నీటిలో భారీ కొండచిలువ
వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో పాములు ఇండ్లలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పురాణాపూల్ లో కూడా వరదనీటితో
భారీగా పడుతున్న వర్షాల కారణంగా వాగులు చెరువులలో వరద నీరు చేరుకోవడంతో అవి ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఆ విధంగా వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో పాములు ఇండ్లలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పురాణాపూల్ లో కూడా వరదనీటితో పాటు ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. దానిని చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జియాగూడ మీదుగా పురాణాపూల్ నుండి మూసిలోకి ప్రవహిస్తున్న వరద నీటిలో కొండ చిలువ కొట్టుకొచ్చింది. అది చూసిన దోబి ఘాట్ స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
వెంటనే స్థానికులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా పురాణపూల్ వద్ద ఉన్న డిఆర్ ఎఫ్ టీం కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని స్నేక్ ను పట్టుకునే వాళ్లను పిలిచి కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు అంత పెద్ద కొండచిలువ ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆలోచనలో పడ్డారు.