Prajavani : ప్రజావాణికి క్యూ కట్టిని జనం

ప్రజావాణికి అనూహ్య స్పందన కనిపిస్తుంది. మంగళవారం కావడంతో ఈరోజు ప్రజావాణికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.;

Update: 2024-01-02 06:17 GMT
Prajavani : ప్రజావాణికి క్యూ కట్టిని జనం

response to the prajavani is unpredictable. as it was tuesday, a large number of people flocked to prajavani today

  • whatsapp icon

ప్రజావాణికి అనూహ్య స్పందన కనిపిస్తుంది. మంగళవారం కావడంతో ఈరోజు ప్రజావాణికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వచ్చేందుకు క్యూ కట్టారు. దీంతో పూలే ప్రజాభవన్ లో ప్రజలు బారులు తీరారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్ కు కూడా కొంత సమస్యగా మారింది.

ఒంటిగంట వరకూ...
మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండటంతో వినతి పత్రాలను అందించి అధికారుల నుంచి హామీ పొందాలని ప్రజలు భావించి ఇక్కడకు వస్తున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. పోలీసులకు కూడా ప్రజావాణి కోసం వచ్చిన వారిని నియంత్రించేందుకు కష్టమైపోతుంది.


Tags:    

Similar News