Telangana : నేడు ధరణిపై కమిటీ సమావేశం

ధరణి సమస్యలపై నేడు కమిటీ రెండో విడత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది;

Update: 2024-01-17 03:30 GMT
Telangana : నేడు ధరణిపై కమిటీ సమావేశం

second session of the committee will be held today on dharani issues. 

  • whatsapp icon

ధరణి సమస్యలపై నేడు రెండో విడత కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సచివాలయంలో జరగనుంది. ప్రధానంగా ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలపై ఈ కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మార్పులు చేర్పుల గురించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ప్రస్తావించనుంది.

సూచనలు... సలహాలు...
ధరణిలో అనేక పొరపాట్లు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అనేక భూ సమస్యలు ధరణి పోర్టల్ ద్వారా ప్రారంభమయ్యాయని తేలింది. ప్రజల నుంచి కూడా ధరణి విషయంలో అనేక దరఖాస్తులు అందడంతో ఇందుకోసం కమిటీని నియమించారు. ఈ కమిటీ తొలి విడత సీసీఎల్‌ఏ కార్యాయలంలో సమావేశమయింది. రెండో విడత సమావేశం నేడు జరగనుంది.


Tags:    

Similar News