రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు;

Update: 2023-12-13 03:01 GMT
assembly meetings, speaker election, tomorrow, telangana, telangana news

telangana assembly sessions

  • whatsapp icon

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు సభ్యులు కొత్త స్పీకర్ను ఎన్నుకుంటారు. ఇప్పటికే సభాపతిగా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. ఈరోజు ఎవరూ నామినేషన్ వేయకపోతే రేపు ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత...
ఈ నెల 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఇరు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపడుతారు. తొలి సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీసే అవకాశముంది. అదే సమయంలో గత ప్రభుత్వపాలనను కూడా కాంగ్రెస్ నేతలు ఎండగట్టనున్నారు.


Tags:    

Similar News