నేడు బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం

తెలంగాణ బడ్జెట్ ను నేడు మంత్రిమండలి ఆమోదించనుంది. ఈరోజు జరిగే మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది;

Update: 2022-03-06 01:59 GMT
budget meeting, cabenet meeting, telangana, governor
  • whatsapp icon

తెలంగాణ బడ్జెట్ నేడు మంత్రిమండలి ఆమోదించనుంది. ప్రగతి భవన్ లో ఈరోజు జరిగే మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు హక్కులు కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్ని రోజులనేది..
అయితే ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని చెబుతోంది. రేపు బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఈరోజు మంత్రి మండలి సమావేశమై బడ్జెట్ ను ఆమోదించనుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News