Telangana : నేటితో ముగియనున్న రేవంత్ రెడ్డి విదేశీ టూర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటారు;

Update: 2024-08-13 08:02 GMT
revanth reddy foreign tour, telangana cm visits south korea, hyderabad
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పది రోజులకు పైగానే విదేశీ పర్యటనలో ఉన్నారు. తొలుత అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం అనేక పెట్టుబడులు సాధించింది. అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.

అమెరికా, దక్షిణ కొరియాలో...
ఎక్కువ రోజులు అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి తర్వాత చివరి రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందకు కొరియా ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ తెలిపింది. వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.


Tags:    

Similar News