పాఠశాలలకు వేసవి సెలవులు
తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వేసవి సెలవులు 48 రోజుల పాటు ప్రకటించింది.
తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వేసవి సెలవులు 48 రోజుల పాటు ప్రకటించింది. వచ్చే నెల 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఈ 48 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వడం కూడా కష్టంగా మారింది.
పరీక్షల అనంతరం...
ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. దీంతో పాటు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్నాయి ఇక ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వచ్చే నెల 12వ తేదీ నుంచి 20వరకూ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. పరీక్షల అనంతరం ఫలితాు వెల్లడిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తారు.