విదేశాలకు చీఫ్ సెక్రటరీ... బాధ్యతలను?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు.;

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రేపటి నుంచి ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండరు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అరవింద్ కుమార్ కు....
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కెన్యాకు బయలుదేరి ఈ నెల 2వ తేదీన వెళుతున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో జరగనున్న ఇక్రిశాట్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 6వ తేదీన ఆయన తిరిగి బయలు దేరి వస్తారు. అప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యవసర బాధ్యతలను అరవింద్ కుమార్ కు అప్పగించారు.