నేటి నుంచి తెలంగాణలో ఫీవర్ సర్వే

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. నేటి నుంచి ఫీవర్ సర్వేను ప్రారంభించనుంది.

Update: 2022-01-21 04:11 GMT

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇటీవల జరిపిన సర్వేలో దాదాపు ఇరవై లక్షలమందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యంపై సిబ్బంది ఆరా తీస్తారు. జ్వరం, గొంతునొప్పు, దగ్గు, జలుబు వంటి లక్షణాలను సిబ్బంది పరిశీలిస్తారు.

మెడికల్ కిట్స్ ను...
జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారికి మెడికల్ కిట్ ను అందజేయాలని నిర్ణయించారు. దాదాపు రెండు లక్షల కిట్లను ప్రభుత్వం సిద్దం చేస్తుంది. ఈ సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి కొంత స్పష్టత వస్తుంది. అనంతరం కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసేందుకు అవకాశాలున్నాయి.


Tags:    

Similar News