వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీగా;

Update: 2023-12-22 11:27 GMT
telangana, pending, challans, transport, telangana government on pending challans big discount, telangananews, telangana transport

 telangana government  

  • whatsapp icon

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్‌ను ప్రకటించబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే ఇప్పుడు పెండింగ్ చలాన్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తేలింది. 2 కోట్ల‌కు పైగా పెండింగ్ చ‌లాన్లు ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల‌పై 90 శాతం రాయితీ, టూ వీల‌ర్స్‌పై 80 శాతం, ఆటోలు, ఫోర్ వీల‌ర్‌పై 60 శాతం, భారీ వాహ‌నాల‌పై 50 శాతం రాయితీని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు వాహ‌న‌దారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకు వసూలు అయ్యాయి. దాదాపు 65 శాతం చలాన్లు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ చలాన్లు పెరిగివడంతో ప్రభుత్వం మరోసారి రాయితీని ప్రకటించింది.

2022, ఫిబ్ర‌వ‌రి నెల‌లో పెండింగ్ చ‌లాన్ల‌పై బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించింది. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సుల‌కు 70 శాతం, లైట్‌, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. నాడు రూ. 300 కోట్ల వ‌ర‌కు పెండింగ్ చ‌లాన్ల‌పై వ‌సూళ్లు అయ్యాయి.



Tags:    

Similar News