Telangana : నేడు మెదక్ చర్చికి తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ లో పర్యటించనున్నారు. మెదక్ లో ఉన్న చర్చిని ఆయన సందర్శిస్తారు

Update: 2024-12-22 02:18 GMT




 

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ లో పర్యటించనున్నారు. మెదక్ లో ఉన్న చర్చిని ఆయన సందర్శిస్తారు. కేథడ్రల్ చర్చి శత వసంత వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. ఉదయం పదకొండు గంటలకు మెదక్ కు చేరుకుని చర్చిలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారని రాజ్ భవన్ కార్యాలయం తెలిపింది. తర్వాత కొల్పారం బాలిక సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులతో గవర్నర్ ముచ్చటిస్తారు.

విద్యార్థులతో కలసి...
వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీస్తారు. అనంతరం వారితో కలసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి మెదక్ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్ లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గవర్నర్ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ

Tags:    

Similar News