KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తాం.. అసెంబ్లీలో కేటీఆర్ సవాల్

అధికార పార్టీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు

Update: 2024-12-21 07:00 GMT

అధికార పార్టీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ సభ్యులమంతా రాజీనామా చేస్తామని తెలిపారు. ఇప్పుడే గ్రామాలకు వెళ్లి కనుక్కుందామని ఆయన అన్నారు. రైతు భరోసా అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసా నిధులను ఏ ఏ పంటలకు ఇవ్వాలో చెప్పాలన్నారు. అలాగే ఎన్ని పంటలు సాగవుతున్న భూములకు రైతు భరోసా నిధులు ఇస్తారో తెలిపాలన్నారు. అలాగే నిబంధనల పేరుతో రైతులను అన్యాయం చేయవద్దని అన్నారు.

ఇచ్చింది తక్కువేనని...
గత ప్రభుత్వ హయాంలో అందరికీ రైతు భరోసా అందిందని, అయితే తమ ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేశాయని తెలిపారు. రైతు భరోసా నిధుల విషయంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ గత ప్రభుత్వం ఇచ్చిందని, అయితే ఎక్కువ ఎకరాలున్న రైతులు ఒక శాతం మంది మాత్రమే ఉంటారని కేటీఆర్ అన్నారు. వందల ఎకరాల భూమి ఉన్న వారు తెలంగాణలో ఎంత మంది ఉన్నారో కనీసం పాలకులకు తెలుసా? అని ప్రశ్నించారు. కేవలం తమపై బురద జల్లి రైతు భరోసా నిధులను ఎగవేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.
ఎంతమందికి ఇస్తారు?
అలాగే రైతు భరోసా కింద రెండు విడతలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తారా? లేక ఒక విడత మాత్రమే విడుదల చేయనున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్థిక సాయాన్ని ఒక పంటకు ఇ్తారా? రెండు పంటలకు ఇస్తారో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. మూడు పంటలకు ఇవ్వాలని గతంలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన వారికే ఇస్తారా? అని అడిగారు. ఆ పథకం కింద కేవలం ఇరవై శాతం మందికే అందుతుందని గుర్తు చేశారు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ నిలదీశారు. పీఎం కిసాన్ సమ్మాన్ వర్తించిన వారికే ఇస్తామంటే ఇక చర్చ ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News