Telangana : నేడు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా జరగనున్నాయి. రైతు భరోసా పై చర్చ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా జరగనున్నాయి. వాస్తవానికి నిన్నటితో ముగియాల్సి ఉన్నా ఒకరోజు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న భూ భారతి, రైతు భరోసా వంటి అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగాల్సి ఉంది. అయితే సభ్యుల ఆందోళన ఫలితంగా నిన్న భూభారతి చర్చ వరకే పరిమితమయింది.
రైతు భరోసాపై నేడు చర్చ...
అందుకే నేడు కూడా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే సమావేశాలు ప్రారంభమయిన వెంటనే ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా రైతు భరోసా పై చర్చించాలని నిర్ణయించారు. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను, ఎప్పటి నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే విషయాన్ని నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశముంది.