Revanth Reddy : టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి షాక్.. ఇకపై టిక్కెట్ల ధరల పెంపునకు నో

Update: 2024-12-21 09:54 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు షాకిచ్చారు. సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను బెనిఫిట్ షోలకు, ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వబోనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ టిక్కెట్ల ధరలను పెంచనివ్వనని తెలిపారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట విషయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడారు. ఆరోజు అల్లు అర్జున్ అనుమతి లేకుండా రావడం వల్లనే ఒక పేద మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు.

పేదల ప్రాణాలు...
ఒక కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చి టాప్ లేని కారులో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్లడం సినిమా వాళ్ల వ్యవహార శైలికి అద్దం పడుతుందన్నారు. థియేటర్ యాజమాన్యంపై కేసులు పెట్టామని, అల్లు అర్జున్ కూడా బాధ్యతరాహిత్యంగా వ్యవహించారన్నారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవచ్చని, కానీ ప్రాణాలతో చెలగాటమాడవద్దని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కానీ కొందరు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగానే నెట్టింట పోస్టులు పెట్టారని, ఇది అన్యాయమట అంటూ ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News