ఈ నెల 25న మెదక్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 25వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 25వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్ రెడ్డి చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయాన్ని సందర్శిస్తారు.
అధికారుల ఏర్పాట్లు...
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో మెదక్ జిల్లాకు చెందిన పార్టీ నేతలను కలసి కొద్దిసేపు ముచ్చటించే అవకాశాలున్నాయి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనకు వస్తుండటంతో అధికారులు సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now