నేడు అమిత్ షాతో తమిళి సై భేటీ

తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు;

Update: 2022-04-07 04:07 GMT
tamilisai, governor, telangana, amit shah,  union home minister
  • whatsapp icon

తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోదీని కలిసిన తమిళిసై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. వ్యాక్సినేషన్ ను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కలిశానని తమిళిసై చెప్పినప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మోదీకి వివరించినట్లు సమాచారం.

అవమానాలను.....
నిన్న అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఖారరు కాకపోవడంతో ఢిల్లీలోనే తమిళిసై ఉన్నారు. ఈరోజు అమిత్ షాను ఆమె కలవనున్నారు. గవర్నర్, రాజభవన్ కు జరుగుతున్న అవమానాల గురించి ఆమె అమిత్ షాకు వివరించనున్నారు. ప్రొటోకాల్ ను కనీసం చీఫ్ సెక్రటరీ కూడా పాటించడం లేదని ఫిర్యాదు చేయనున్నారు.


Tags:    

Similar News