ఇంటర్ విద్యార్థుల్లారా.. మీకో కీలక సూచన

Update: 2022-10-14 12:39 GMT

ఇంటర్మీడియట్ సిలబస్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే నిర్వహించబోతున్నామని ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నిర్వ‌హించే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వంద శాతం సిలబ‌స్‌తో నిర్వ‌హించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వంద శాతం సిల‌బ‌స్‌తో కూడిన ఇంట‌ర్ ప్ర‌శ్నాప‌త్రాల‌ను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

కరోనా పరిణామాల కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ తోనే బోధన జరిగింది. ఆ సిలబస్ తోనే పరీక్షలను నిర్వహించారు. ప్రభుత్వం 70 శాతం సిలబస్ తోనే విద్యాబోధన.. పరీక్షలు జరిపించింది. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమవ్వడం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకుపోతూ ఉండడంతో 100శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభం అయ్యాయని.. త్వరలోనే విద్యార్థులకు 100 శాతం సిలబస్ బోధన పూర్తవువుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు, నిపుణనులతో సమీక్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకు 100శాతం సిలబస్ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News