Telangana : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పదో తరగతి పరీక్ష ఫలితాలు 30న విడుదల చేస్తారు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలవుతాయని తెలిపారు. ఒకేసారి ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పదో తరగతి ఫలితాలు...
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ పరీక్షకు దాదాపు తొమ్మిది మంది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ లో మొదటి సంవత్సరం 4,78,527 మంది, రెండో సంవత్సరం 4,43,993 మంది హాజరయ్యారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. 30వ తేదీన ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రాధమిక విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.