Hydra : హైడ్రా కు గవర్నర్ ఓకే

హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ఆమోదం తెలిపారు

Update: 2024-10-05 11:11 GMT

Hydra In Telangana

హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. హైడ్రా గత కొద్ది రోజులుగా నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన భవనాలను కూల్చివేస్తుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను సయితం హైడ్రాపై వదలడం లేదు. అయితే హైడ్రాపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఎంత అన్న ప్రశ్న న్యాయస్థానం నుంచి ఎదురయింది.

ఆర్డినెన్స్ కు...
దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఇటీవల హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దానిని గవర్నర్ కు పంపింది. ఈరోజు గవర్నర్ హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డెనెన్స్ కు ఆమోదం తెలిపారు. ఈ చట్టాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి ప్రభుత్వం ఆమోదించనుంది. దీంతో హైడ్రా తన పనులను సులువుగా చేసుకునే వీలు కలుగుతుంది.


Tags:    

Similar News