Breaking : హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు;

Update: 2023-12-05 12:56 GMT
revanth reddy, peddamma temple, family members, hyderabad
  • whatsapp icon

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో అధినాయకత్వం సంప్రదింపులు జరిపింది. ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న దశలో రేవంత్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం చర్చనీయాంశమైంది.

రెండు రోజులుగా...
ఆయన ఏఐసీసీ భవన్ లో పార్టీ నేతలను కలవనున్నారు. కాసేపట్లో పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నారు. ఒక్కసారిగా పిలుపు రావడంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లోనే సస్పెన్స్ కు తెరపడనుంది.


Tags:    

Similar News