ఆయ్.. గోదారోళ్లా మజాకా..?
సంక్రాంతి పండగకు వచ్చిన కొత్త అల్లుడికి 173 రకాల వంటకాలను వండించి అల్లుడిని మురిపించారు.;
గోదారోళ్లు అంటే మర్యాదలకు ముందుంటారు. బయట నుంచి వచ్చిన వారికి ఎవరికైనా తిన్నంత తిండి పంపిస్తారు. ఇక పండగ పూట అల్లుడు ఇంటికి వస్తే.. ఇక వేరే చెప్పాలా? అందులో సంక్రాంతి పెద్ద పండగ. అలంటి పండగకు అల్లుడు ఇంటికి వచ్చాడంటే మామగారు ఊరుకుంటారా? పెట్టి చంపేయరూ... గోదావరిలో జరిగే ప్రతి ఏటా జరిగే కార్యక్రమమైనా మనం ఎప్పటికప్పడు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్తదనం రుచులతో పాటు వార్తల్లో కూడా ఉంటుంది. సంక్రాంతి పండగకు వచ్చిన కొత్త అల్లుడికి 173 రకాల వంటకాలను వండించి అల్లుడిని మురిపించారు.
173 రకాల వంటకాలు...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పారిశ్రామికవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు రెండేళ్ల క్రితం తమ కుమార్తె హారికకు వివాహం చేశారు. ఈ ఏడాది సంక్రాంతి పండగకు అల్లుడు రావడంతో తటవర్తి బద్రి కుటుంబం మామూలుగా మర్యాదలు చేయలేదు. ఇంటికి వచ్చిన అల్లుడికి 173 రకాలు వంటకాలు కొన్ని చేసి, కొన్నింటిని తెప్పించి వరీ అరిటాకులో వడ్డించారు. దీంతో తినలేక అల్లుడు పండగ పూట అవస్థలు పడ్డాడనుకోండి వేరే ముచ్చట అది. అన్ని తినలేక అలా టేస్ట్ చూసి అత్తామామలను మురిపించాడట ఆ అల్లుడు.