Cock Fight : కదనరంగంలో కుక్కుట శాస్త్రం...కోడి జాతకం చెప్పేస్తుందిలా

సంక్రాంతికి కనిపించే కోడిపందేలను ఆషామాషీగా నిర్వహించరు. దీనికి ఒక శాస్త్రం ఉంది.;

Update: 2025-01-11 12:29 GMT

సంక్రాంతికి కనిపించే కోడిపందేలను ఆషామాషీగా నిర్వహించరు. దీనికి ఒక శాస్త్రం ఉంది. దానిని అధ్యయనం చేసి ఏ కోడి గెలుస్తుందో ముందుగానే తెలుసుకుని దానపై పందెం కడతారు. అందుకే దీనికి కుక్కుట శాస్త్రం అని పిలుస్తారు. సంక్రాంతి అంటే కోడిపందేలకు ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి. ఇటీవల కాలంలో తెలంగాణలోనూ అక్కడక్కడా ఆ సంస్కృతి కనపడుతుంది. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడిపందేలకు దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రసిద్ధి. సంక్రాంతి కోడిపందేల కోసం ఏడాదంతా కోళ్లను యుద్ధానికి సైనికులను సిద్ధం చేసినట్లు చేస్తారు. అదొక పరిశ్రమలా ఉభయగోదావరి జిల్లాల్లో మారిందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్కొ పందెం కోడి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకూ ధర పలుకుతుందనడంలో అతి శయోక్తి లేదు.

ఏ రంగు కోడిని...
కోడి కాళ్లకు కత్తిని కట్టి వాటిని కదనరంగంలో దించినప్పుడు వారి ముఖాల్లో ఆనందం చూడాలి. ఎంత చూసినా తనవి తీరదు. ఆ హ్యాపీ నెస్ వేరుగా ఉంటుంది. తాను ఏడాది పెంచిన కోడి యుద్ధంలో గెలిచి విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది సంప్రదాయంగా వస్తున్నదే అయినప్పటికీ అనేక సెంటిమెంట్లుకూడా కోడి పందేల విషయంలో పాటిస్తారు. కోళ్ల యజమానుల నుంచి పందెంవేసేవారు సయితం కోడి పురాణం ప్రకారం పందేలు కాస్తారు.కుక్కుటశాస్త్రంలో చెప్పిన విధంగా పందేలను కాస్తూ డబ్బులు సంపాదించుకోవాలన్నప్రయత్నం బరి వద్ద ఉన్న ప్రతిఒక్కరిలోనూ కనపడుతుంది. కోడికి వేల రూపాయల్లో ఖర్చుచేశామన్నవిషయాన్నికూడా ఆ సమయంలో మర్చిపోతారు
ఏ రోజు ఏ కోడిని...
కుక్కుట శాస్త్ర ప్రకారం కోడి పందెంలో రెండు అంశాలు ముఖ్యమైనవిగా భావిస్తారు. కోడి జాతి, రెండు దానికి ఇచ్చే శిక్షణ. కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్ర డేగ వంటి జాతులు ఉంటాయని పందెం వేసేవాళ్లు చెబుతారు. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని రకాలుగా విభజించారు. ఏడాదికి పైగా శిక్షణ ఇచ్చిన వీరు పందెం బరిలోకి వదులుతారు. కుక్కుట శాస్త్రం ప్రకారమే ఏ జాతి పుంజును బరిలోకి దింపాలా? అన్నది నిర్ణయిస్తారు. కోళ్లకు సంబంధించి ఈ శాస్త్రం లో కోడియజమాని పేరు, జన్మనక్షత్రాలను బట్టి కోడిపుంజును ఎంపిక చేస్తారు. ఆ శాస్త్ర ప్రకారం బరిలోకి దింపితే గెలుపు తథ్యమని భావిస్తారు. ఏ రోజున ఏ పుంజు వేయాలో ఈ శాస్త్రం చెబుతుందని పందెం రాయుళ్లు చెబుతారు. అలాగే ఏ రోజు ఏ రంగు కోడిని వేస్తే గెలిచివస్తుందో కూడా ఆ శాస్త్రం చెబుతుందట. మూడు రోజుల పాటు సాగే ఈ పందేలలో మూడు రకాలైన కోళ్లను బరిలోకి దింపడం సంప్రదాయంగా వస్తుంది. భోగి పండగ రోజు గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు , సంక్రాంతి పండగ రోజున యాసర కాకి డేగలు, కాకి నెమళ్లు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందు తాయన్నది నమ్మకం చాలామందిలో కనిపిస్తుంది.


Tags:    

Similar News