ఎండ దెబ్బకు కోటి బీర్లు తాగేశారు
హైదరాబాద్ లో ఎండలకు పది హేడు రోజుల్లోనే 1.01 కోట్ల బీర్లు తాగేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ ఏప్రిల్ మొదటి మాసంలోనే ఎండలు దంచి కొంటాయి. దీంతో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కేవలం పది హేడు రోజుల్లోనే 1.01 కోట్ల బీర్లు తాగేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే కోటికి పైగా బీర్లను తాగేసినట్లు అధికారులు తెలిపారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు బీర్లను ఆశ్రయించారని తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో....
ఏప్రిల్ నెలలో పదిహేడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకం జరిగిందని, గతంలో ఎన్నడూ ఇలలా జరగలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో గత ఏడాది కంటే పది శాతం బీర్ల విక్రయాలు పెరిగాయని చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజుకు ఆరు లక్ష బీర్లు తాగేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే బీర్లు తాగినంత మాత్రం బాడీ కూల్ కాదని వైద్యులు చెబుతున్నారు.